Purushothamudu: రాజ్‌ తరుణ్‌ అలాంటోడు కాదు…’పురుషోత్తముడే’ !

-

షార్ట్ ఫిలిం తో కెరియర్ మొదలుపెట్టి అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఉయ్యాల జంపాల అనే సినిమాతో హీరోగా రాజ్ తరుణ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక తొలి మూవీతోనే రాజ్ తరుణ్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాడు. దీంతో రాజ్ తరుణ్ కి నిర్మాతల నుంచి మంచి ఆఫర్స్ వచ్చాయి. వాటిలో కొన్ని సినిమాలకు రాజ్ తరుణ్ ఒకే కూడా చేశాడు. అయితే రాజ్ తరుణ్ కెరియర్ మొదట్లో మంచి సినిమాలను ఎంచుకుంటూ ముందుకు సాగాడు. ఆయన నటించిన సినిమా చూపిస్త మామ, కుమారి 21f లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి.

ఇదిలా ఉంటే… ఇటీవల రాజ్ తరుణ్ పై ఉన్న కేసుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలో లావణ్య అనే ఒక అమ్మాయి తో రిలేషన్షిప్ కి వెళ్లి ఆ తర్వాత ఒక హీరోయిన్ తో ప్రేమాయణం సాగించాడు అని చాలా ఆరోపణలను ఎదుర్కొంటున్న ఈ సందర్భంలో ఆయన ఇటీవల నటించినటువంటి పురుషోత్తముడు సినిమా ట్రైలర్ రిలీజ్ అవడంతో చాలామంది సోషల్ మీడియా వేదికగా తెగ ట్రోల్ చేస్తున్నారు. ఏమయ్యా రాజ్ తరుణ్ .. వ్యక్తి పేరు లో రాముడు ఉండటంకాదు .. వ్యక్తిత్వంలో రాముడు ఉండాలి.. మూవీలోని డైలాగులు రియల్ లైఫ్ కి అటాచ్ చేస్తూ నెట్టింటా కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news