రూ.లక్షలోపు రుణం మాఫీ కానీ రైతులకు అలర్ట్.. మంత్రి తుమ్మల కీలక ప్రకటన

-

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఏక కాలంలో రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తోంది. ఈ నెల 18వ తేదీ నుండి రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో జమ చేస్తోన్న ప్రభుత్వం.. ఫస్ట్ ఫేజ్లో భాగంగా లక్ష లోపు పంట లోన్ ఉన్న రైతులకు మాఫీ చేసింది. ఈ నెల చివరి వరకు లక్షన్నర, ఆగస్ట్ 15 నాటికి రూ.2 లక్షల రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే, తొలి విడతలో లక్ష లోపు రుణం ఉన్నప్పటికీ కొందరు రైతులకు లోన్ మాఫీ కాలేదు. దీంతో ఆ రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ లోన్ లక్ష లోపే ఉన్నప్పటికీ ఎందుకు మాఫీ కాలేదని హైరానా పడుతున్నారు.

ఈ క్రమంలో లక్షలోపు మాఫీ కానీ లోన్లపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. లక్ష లోపు పంట రుణం ఉండి ఫస్ట్ ఫేజ్లో లోన్ మాఫీ కానీ రైతులకు పది రోజుల్లో రుణమాఫీ అవుతోందని స్పష్టం చేశారు. సెకండ్ ఫేజ్లో భాగంగా వారి అకౌంట్లలో డబ్బులు పడతాయని.. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని క్లారిటీ ఇచ్చారు. 3 లక్షల మందికి ఆధార్ కార్డులో లోపాలు ఉన్నాయని.. ఆ సమస్యలను పరిష్కరించి రెండో విడతలో వారి ఖాతాల్లో డబ్బులు జమ చేస్తామని తెలిపారు. అర్హులైన రైతులందరి అకౌంట్లను బ్యాంకులు ప్రభుత్వానికి ఇచ్చాయని.. ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్కు డబ్బులు కూడా కట్టామని పేర్కొన్నారు. బ్యాంకులలో తప్పు జరిగితే చర్యలు తీసుకుంటామన్నారు. రూ.31 వేల కోట రుణమాఫీ చేశామని, కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకుందని అన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news