లష్కర్ బోనాల్లో రంగం భవిష్యవాణి చెప్పిన స్వర్ణలత

-

సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి బోనాల వేడుకలో భాగంగా భక్తురాలు స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మట్టి బోనమైనా, స్వర్ణ బోనమైనా.. ఎవరు తీసుకొచ్చినా తాను సంతోషంగా అందుకుంటానని ఆమె తెలిపారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, పంటలు బాగా పండుతాయని చెప్పారు. వ్యాధులు రాకుండా ప్రజలను కాపాతానని అభయమిచ్చారు. ప్రజలను చల్లగా చూస్తానని చెప్పారు.

రెండో రోజున సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవం ఘనంగా జరుగుతోంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి భారీ ఎత్తున పోటెత్తుతున్నారు. రంగం భవిష్యవాణి కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, భక్తులు అడిగిన సందేహాలను మాతంగి స్వర్ణలత నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ.. ఈ ఏడాది భక్తులు 48 గంటలు వర్షంలో తడుస్తూ అమ్మ దర్శనం చేసుకున్నారని చెప్పగా.. నా దర్శనం చేసుకోవాలంటే ఆ మాత్రం కష్టపడాలి అప్పుడే ఫలితం ఉంటుంది అని మాతంగి అన్నారు. ఈ ఏడాది పూజలు ఘనంగా అందుకున్నానని.. ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news