విద్యుత్ ఆఫీస్ లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.19లక్షలు తీసుకొని మోసం చేశాడు ఓ జూనియర్ అసిస్టెంట్. వివరాల్లోకి వెళ్లితే.. ఎల్బీనగర్ – నాగోల్ మమతనగర్కు చెందిన ఓ యువతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ప్రిపర్ అవుతోంది. విద్యుత్ శాఖలో టీజీఎస్పీడీసీఎల్ జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న వ్యక్తి ఆ యువతికి పరిచయం అయ్యాడు. ఈ పరిచయంలో ఆ యువతికి కూడా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పాడు.
తనకు ఉన్న పరిచయంతో నమ్మింది ఆ యువతి. ఎలాగో ఉద్యోగం ఇప్పిస్తాడని.. విడతల వారీగా రూ.19.50 లక్షలు ఇచ్చింది. ఆపై ఉద్యోగం ఇప్పించకుండా కాలయాపన చేస్తుడడంతో ఆ యువతి నిలదీసింది. దీంతో అతను ఓ నకిలీ అపాయింట్మెంట్ లెటర్ తీసుకొచ్చి ఇచ్చాడు. అది ఫేక్ అని తేలడంతో డబ్బులు తిరిగి ఇవ్వాలని మరోసారి గట్టిగా అడగడంతో.. ఆరు నెలల్లో డబ్బులు ఇస్తానని అంగీకరించాడు. ఆరు నెలలైనా డబ్బులు ఇవ్వకపోవడంతో తాజాగా నాగోల్ పోలీస్ స్టేషన్లో యువతి ఫిర్యాదు చేసింది.