సనత్ నగర్ లో ముగ్గురు మృతుల మిస్టరీని ఛేదించారు పోలీసులు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి ..తల్లి.. కుమారుడు బాత్రూంలో ఆదివారం రోజున మృతి చెందారు. గ్యాస్ సిలెండర్ ద్వారా గీజర్ ను వాడుతోంది బాధిత ఫ్యామిలీ. అయితే.. గ్యాస్ సిలెండర్ నుంచి విషవాయులు వెలవడంతో మృతి చెందారు. గత కొంతకాలం నుంచి గ్యాస్ సిలిండర్ ద్వారా గీజర్ ని వాడుతోంది కుటుంబం.
ముందుగా కుమారుడు స్నానం చేసేందుకు వెళ్లి సృహ తప్పి పడిపోయినట్లుగా గుర్తించారు పోలీసులు.
కుమారుడు పడిపోవడంతో బాత్రూంలోపలికి వెళ్లారు తల్లి ..తండ్రి. ఈ తరుణంలోనే… గ్లీజర్ నుంచి గ్యాస్ విడుదల కావడంతో అక్కడి కక్కడే స్పృహ తప్పి పడిపోయారు ముగ్గురు. గ్లిజర్ గ్యాస్ రెండు మిక్స్ అయి విషవాయులు విలవడంతో ముగ్గురు మృతి చెందినట్లు గుర్తించారు పోలీసులు. ముగ్గురి మృతదేహాలకి పోస్టుమార్టం పూర్తి కుటుంబ సభ్యులకు మృతదేహాలు అప్పగించారు.