ట్రంప్‌పై హత్యాయత్నం మా వైఫల్యమే.. సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్‌ అంగీకారం

-

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆయణ్ను కాల్పుల దాడి నుంచి రక్షించడంలో సీక్రెట్ ఏజెన్సీ విఫలమైందని విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అయితే తొలుత ఈ విషయాన్ని అంగీకరించని సీక్రెట్ ఏజెన్సీ తాజాగా దీనిపై స్పందించింది. ట్రంప్ను కాల్పుల దాడి నుంచి రక్షించడంలో తమ ఏజెన్సీ విఫలమైందని సీక్రెట్ సర్వీస్ డైరెక్టర్ కింబర్లీ చీటల్ అంగీకరించారు.

ట్రంప్‌పై జరిగిన దాడి సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెన్సీకి కొన్ని దశాబ్దాల్లో అత్యంత ఘోరమైన వైఫల్యమని ఆమె అన్నారు. కాల్పులకు కొంత సమయం ముందు ఓ అనుమానిత వ్యక్తి గురించి తమ ఏజెన్సీకి స్థానిక పోలీసుల నుంచి సమాచారం అందిందని .. అయితే వారు అది కచ్చితంగా ప్రమాదమని చెప్పలేదని, హెచ్చరించి ఉంటే ర్యాలీని సీక్రెట్ సర్వీస్ నిలిపివేసేదని కింబర్లీ తెలిపారు. అమెరికాలోని రెండు ప్రధాన రాజకీయ పార్టీల చట్టసభ సభ్యులతో జరిగిన కాంగ్రెస్ విచారణలో ఆమె ఈ మేరకు కింబర్లీ చీటల్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news