ఈ నెల 25న అసెంబ్లీలో బడ్జెట్ అనంతరం.. అదేరోజు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా మేడిగడ్డ పర్యటనకు బయలుదేరనున్నారు.26న కన్నెపల్లి పంప్‌హౌస్‌ను సందర్శించనున్నట్లు ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రకటించారు.మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్,సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు కోవా లక్ష్మి, చింతా ప్రభాకర్,విజయుడు, ఎమ్మెల్సీ సురభి వాణిదేవితో కలిసి తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీకి చెరో 8 సీట్లలో గెలిపిస్తే.. బడ్జెట్‌లో తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చారని ఎద్దేవ చేశారు.
రేపు పార్లమెంట్‌లో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. బీఆర్‌ఎస్ ఎల్పీ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన 3గంటల పాటు జరిగిందని అన్నారు.లక్షల క్యూసెక్కుల నీరు గోదావరిలో వృథాగా పోతున్నా ప్రభుత్వం పంపుల ద్వారా ఎత్తిపోయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మిడ్ మానేరు, కొండ పోచమ్మ సాగర్, రంగ నాయక సాగర్‌లో నీరు నింపి రైతుల పొలాలకు తరలించాలని ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతామని అన్నారు.శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా మధుసూధనచారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు చెప్పారు.