తెలంగాణ రాష్ట్రం నడుము ఒంగిపోయి.. ఎయిడ్స్, క్యాన్సర్ ఉన్న స్థితిలో ఉంది : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్రం నడుము ఒంగిపోయి.. ఎయిడ్స్, క్యాన్సర్ ఉన్న స్థితిలో ఉందని  సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మోడీ ప్రబుత్వం పెట్టిన ప్రతీ బిల్లుకు మద్దతు పలికారని సీఎం విమర్శించారు.

అదానీలతో కాంగ్రెస్ ప్రభుత్వం కుమ్మక్కయిందని కేటీఆర్ ఆరోపించారు. అదానీ, అంబానీలతో కుమ్మక్కు కావాల్సిన అవసరం తమకు లేదని సీఎం అన్నారు.  అసలు కేసీఆరే కేంద్రం తెచ్చిన ఎన్నో చట్టాలకు మద్దతు తెలిపారని ఆరోపించారు. నోట్ల రద్దు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికలు.. ఇలా ఎన్నింటికో మద్దతు తెలిపారన్నారు. నోట్ల రద్దు గొప్ప నిర్ణయమని కేసీఆర్ అన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం నడుము ఒంగిపోయే పరిస్థితిలో ఉంటే.. ఆ నిజాలు చెప్పొద్దంట. లోపల క్యాన్సర్ ఉండాలి ఎయిడ్స్ ఉండాలి. కానీ నేను మంచిగా ఉన్న ఎర్రగా బుర్రగా ఉన్న.. నేను పెళ్లి చేసుకుంటాను అన్నట్టు కేటీఆర్ సూచన చేస్తున్నారని పేర్కొన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news