నేడు ఏపీ కేబినేట్‌ సమావేశం..పోలవరం, డయా ఫ్రం వాల్ పై కీలక నిర్ణయం!

-

ఇవాళ ఏపీ కేబినేట్‌ సమావేశం ఉండనుంది. ఇవాళ మధ్యాహ్నం సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినేట్‌ సమావేశం జరుగనుంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై చర్చ ఉండనుంది. ముఖ్యమంగా పోలవరం విషయంలో కీలక చర్చ ఉంటుంది. పోలవరం ప్రాజెక్టు తాజా అంచనాలు, డయా ఫ్రం వాల్ స్థితి గతులపై ఏపీ కేబినేట్‌ సమావేశంలో కీలక సమీక్ష ఉంటుంది.

ap cabinet chandrababu

ఇక అటు నేడు శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేయనుంది చంద్రబాబు సర్కార్‌. గత 5ఏళ్ల పాలనలో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో అదుపు తప్పిన శాంతి భద్రతల పై శ్వేతపత్రం విడుదల చేయనున్నారు హోమ్ మంత్రి వంగలపూడి అనిత. అలాగే, ఇటీవల చనిపోయిన మాజీ శాసనసభ్యులు పెండ్యాల వెంకట కృష్ణారావు, యెర్నేని సీతాదేవి, అనిశెట్టి బుల్లబ్బాయ్ రెడ్డి, సద్దపల్లి వెంకటరెడ్డిలకు సంతాపం ప్రకటించనుంది శాసనసభ.

Read more RELATED
Recommended to you

Latest news