జ‌గ‌న్ ముంద‌స్తు ఆలోచ‌న‌తో కృష్ణ‌లంక సేఫ్‌.. ఇది క‌దా అభివృద్ధి అంటే

-

ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎంగా ఉండ‌గా వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి దూర‌దృష్టితో చేసిన ప‌నులు ఇప్పుడు ఫ‌లితాల‌నిస్తున్నాయి. 2019లో వైసీపీ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తొలినాళ్ళ‌లోనే ఏపీని భారీవ‌ర్షాలు ముంచెత్తాయి. ముఖ్యంగా కృష్ణా, తూర్పుగోదావరి, ప‌శ్చిమ గోదావ‌రి.. ఇంకా ప్ర‌కాశం, నెల్లూరు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు ప‌డ్డాయి. దీంతో ఎప్పుడూ లేనివిధంగా కృష్ణ‌, గోదావ‌రి న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హించాయి. తీర‌ప్రాంతాల‌ను వ‌ర‌ద నీరు చుట్టుముట్టి భ‌య‌భ్రాంతుల‌కు గురిచేశాయి.

వ‌ర్షాలు వ‌చ్చిన ప్ర‌తిసారీ ఇలా తీర‌ప్రాంతాల వారు ముంపు క‌ష్టాల‌ను ఎదుర్కొనేవారు. అయితే దీనికి శాశ్వ‌త ప‌రిష్కారం ఇచ్చారు అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి. వ‌ర‌ద‌నీరు గ్రామాల్లోకి రాకుండా ఉండాల‌న్న ఉద్దేశ్యంతో రిటైనింగ్ వాల్ నిర్మించాల‌ని జ‌గ‌న్ త‌లిచారు.అనుకున్న‌దే త‌డ‌వుగా న‌దికి ఇరువైపులా గోడ‌ల‌ను నిర్మించేశారు.అయితే ఆ నిర్మాణాలు ఇప్పుడు ఫ‌లితాల‌నిస్తున్నాయి.

ప్రకాశం బ్యారేజీకి ఎప్పుడు వరదలు వచ్చినా కృష్ణ‌లంక చిగురుటాకులా వ‌ణికిపోతుంది. వ‌ర‌ద‌ల‌కు కృష్ణ‌లంక మొత్తం మునిగిపోతుంది. లక్షల క్యూసెక్కుల వరద వచ్చి పేదల ఇళ్లను ముంచేస్తుంది. అలాంటి సమయంలో కృష్ణలంక ప్రజలను అక్కడ నుంచి పునరావాస కేంద్రాలకు తరలించడం…, పరిస్థితి అదుపులోకి వ‌చ్చాక ప్రజలు తిరిగి ఇళ్ళ‌కు చేర్చ‌డం వంటి సంఘ‌ట‌న‌లు ఎప్పుడూ జ‌రిగేవే. అయితే గత వైసీపీ ప్రభుత్వం తీసుకున్న చొరవతో కృష్ణలంక ప్రజలకు శాశ్వత పరిష్కరం దక్కినట్ల‌యింది.

కృష్ణలంక ప్రజలను వరదల నుంచి కాపాడటానికి కనకదుర్గ వారధి నుంచి కోటినగర్‌ వరకు 2.6 కిలోమీటర్ల పొడవునా ఈ రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించింది అప్పటి జగన్ సర్కార్. 125 కోట్ల వ్యయంతో మూడు అడుగుల వెడల్పుతో 18 మీటర్ల లోతులో ర్యాఫ్ట్‌ పద్ధతితో, 8.9 మీటర్ల ఎత్తులో కాంక్రీట్‌ రిటైనింగ్‌ వాల్‌ను నిర్మించారు.ఇప్పుడు కురుస్తోన్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద‌ ఉధృతి పెరిగినప్పటికి రిటైనింగ్‌ వాల్‌ కారణంగా కృష్ణలంక ప్రాంత ప్ర‌జ‌లు సురక్షితంగా ఉన్నారు. మాజీ సీఎం జగన్ ముందు చూపుతో నిర్మించిన ఈ రిటైనింగ్‌ వాల్‌ వల్ల కృష్ణలంక ప్రాంత ప్రజలకు శాశ్వత పరిష్కారం దొరికిందని వైసీపీ నేతలు చెబుతున్నారు.అలాగే నెల్లూరు న‌గ‌రంలో కూడా పెన్నాన‌ది తీరంలో రిటైనింగ్ వాల్ ప‌నులు కొంత వ‌ర‌కు జ‌రిగి ఆగిపోయాయి.వాల్ నిర్మాణం పూర్త‌యితే పెన్నాతీరంలోనూ ముంపు క‌ష్టాలు ఉండ‌బోవ‌ని విశ్లేష‌కులు అంటున్నారు.

ప్ర‌స్తుతం అల్పపీడనం ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వారం రోజులు వర్షాల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఒకటి, రెండు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయంటున్నారు.ఇలాంటి స‌మ‌యంలో వ‌ర‌ద క‌ష్టాల నుంచి గ‌ట్టెక్క‌డానికి జ‌గ‌న్ ముందుచూపుతో నిర్మించిన రిటైనింగ్ వాల్ చ‌క్క‌టి ప‌రిష్కార‌మ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.ఎక్క‌డెక్క‌డ ముంపు ప్రాంతాలు ఉన్న‌యో అక్క‌డ న‌దుల వెంబ‌డి ఇలా రిటైనింగ్ వాల్ నిర్మించాల‌ని డిమాండ్ కూడా ప్ర‌జ‌ల నుంచి వ‌స్తోంది.ఇలాంటి స‌మ‌యంలో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ఆలోచ‌న చేయాల‌ని కోరుతున్నారు.మొత్తానికి వ‌ర‌ద క‌ష్టాల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం ఇచ్చిన జ‌గ‌న్‌ని ఏపీ ప్ర‌జ‌లు శ‌భాష్ అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news