2019 ఎన్నికలకు ముందు వైఎస్ వివేకానందారెడ్డి హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈ కేసుపై సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పలువరు నిందితులు అరెస్ట్ అయి బెయిల్పై జైలు నుంచి విడుదల అయ్యారు. అయితే ఏపీ అసెంబ్లీలో వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు ప్రస్తావన వచ్చింది. దీంతో సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు.
హూ కిల్డ్ బాబాయ్ ఎవరో చెప్పాలన్నారు. వివేకాను ఎవరు చంపారో చెప్పాల్సిన బాధ్యత తమపై ఉందని చంద్రబాబు తెలిపారు. వివేకానందారెడ్డి హత్య కేసు నిందితులను శిక్షిస్తామని హెచ్చరించారు. దోషులను వదిలిపెట్టేదిలేదని తెలిపారు. అలాగే వినుకొండలో జరిగిన రషీద్ హత్య కేసుపైనా ఆయన స్పందించారు. హత్యకు గురైన రషీద్, నిందతుడు జిలానీ ఎవరని ప్రశ్నించారు. వాళ్లిద్దరు ఏ పార్టీలో పని చేశారని నిలదీశారు. హత్యలు, నేరాలు, ఘోరాలు, అరాచకాలకు పాల్పడటం, రాజకీయ ముసుగులో ఎదురు దాడి చేసిన వారిని శిక్షాస్తామని చంద్రబాబు పేర్కొన్నారు.