సచివాలయంలో పంచాయతీ రాజ్ శాఖ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ తో పాటు ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, మాజీ మంత్రి జానారెడ్డిలతో పాటు అధికారులు హాజరయ్యారు. పంచాయతీ ఎన్నికలపై కార్యచరణపై చర్చించారు. త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి.. ఆగస్టు నెల చివరి వరకు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది.
గత ఐదేళ్ల కిందత ఎన్నికల్లో కేటాయించిన రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ సమీక్ష సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే సర్పంచ్ ల పదవీ కాలం ముగిసి దాదాపు 6 నెలలు కావస్తున్నందున రిజర్వేషన్ లో ఎలాంటి మార్పులు చేర్పులు చేయకుండా గత రిజర్వేషన్లనే కొనసాగించాలని.. ఆగస్టు నెలలో ఎన్నికలు నిర్వహించాలని వార్తలు వినిపిస్తున్నాయి.