ఏపీ విద్యార్థులకు శుభవార్త.. టెట్ లో ఉచిత శిక్షణ !

-

ఏపీలోని విద్యార్థులకు బిగ్‌ అలర్ట్‌. ఏపీలో ఉన్న మైనార్టీ విద్యార్థులకు టెట్ లో ఉచిత శిక్షణ అందించేందుకు ముందుకు వచ్చింది చంద్రబాబు నాయుడు సర్కార్‌. ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ కీలక ప్రకటన చేయడం జరిగింది. తాజాగా రివ్యూ సమావేశం నిర్వహించిన మైనారిటీ సంక్షేమ, న్యాయశాఖ మంత్రి వర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ… ఏపీలో ఉన్న మైనార్టీ విద్యార్థులకు టెట్ లో ఉచిత శిక్షణ అందిస్తామని వెల్లడించారు.

Shocking news for the minority candidates writing TET

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 19 శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జగన్ ప్రభుత్వంలో మైనార్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహించారు. వైసిపి ప్రభుత్వంలో అన్ని వర్గాలు అధోగతి అంటూ విమర్శలు చేశారు మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్. చంద్రబాబు పాలనలో అందరికీ మేలు జరుగుతుందని వివరించారు. ఆగస్ట్‌ 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 25వ తేదీ వరకు టెట్ లో ఉచిత శిక్షణ అందిస్తామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news