అసోం రాజవంశీకుల సమాధులకు యునెస్కో వారసత్వ హోదా

-

మొట్టమొదటి సారిగా ఈశాన్య భారతం నుంచి అసోం రాష్ట్రం యునెస్కో వారసత్వ స్థలాల జాబితాలో చేరింది. అసోంలోని అహోమ్‌ రాజవంశీకులు నిర్మించిన సమాధులను శుక్రవారం రోజున యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేర్చింది. ఈశాన్య రాష్ట్రాల నుంచి ఈ జాబితాలో చేరిన మొట్టమొదటి వారసత్వ సంపద ఇదే కావడం గమనార్హం.

భారత్‌లో జరుగుతున్న యునెస్కో ప్రపంచ వారసత్వ కమిటీ 46వ సమావేశాలలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అసోంలో ఈజిప్ట్ పిరమిడ్ల వంటి మట్టి సమాధులను మోయిదమ్‌ అంటారు. 600 ఏళ్లపాటు అసోం రాష్ట్రాన్ని పాలించిన టాయ్‌ – అహోం రాజవంశం తమ పూర్వీకులను చరాయ్‌ దేవ్‌లో మట్టితో పిరమిడ్‌ ఆకృతిలో నిర్మించిన దిబ్బలలో సమాధి చేస్తుండేది. వేల ఏళ్ల కాలం నాటి ఈ సమాధి దిబ్బలపై ఇప్పుడు మొత్తం పచ్చగడ్డి పెరిగింది. ఈ ప్రాంతం ఇప్పుడు పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సమాధులు యునెస్కో ప్రపంచ వారసత్వ స్థలాల జాబితాలో చేరిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news