పవన్ కళ్యాణ్ ఆదేశాలు.. స్పందించి పోలీసులు..!

-

వెంకటగిరిలో యువతులను, వృద్ధులను వేధిస్తున్న ఆకతాయిలని అదుపు చేయాలన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలకు తక్షణం స్పందించారు తిరుపతి పోలీసులు. వెంకటగిరి ఎన్టీఆర్ కాలనీకి వెళ్ళి అక్కడి ప్రజలతో మాట్లాడిన పోలీసులు.. మొదట అకతాయిల వివరాలు నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత బైక్స్ పై మితిమీరిన వేగంతో ప్రమాదకరంగా సంచరిస్తూ ఆకతాయిలను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారికి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలియజేసారు.

అయితే గత కొన్ని రోజులుగా తిరుపతి ప్రజలను వేధిస్తున్నవారిని పట్టుకొని కేసులు నమోదు చేసి బైండోవర్ చేశామన్న తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు… తాము తీసుకున్న చర్యలను డిప్యూటీ సీఎం పవన్ కు వివరించినట్లు మీడియాకు తెలిపారు. అయితే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని తరుచూ కంప్లైంట్లు వస్తున్నాయని సుబ్బారాయుడికి చెప్పిన పవన్… రౌడీయిజం చేయాలని ఎవరైనా ప్రయత్నిస్తే అదుపులో పెట్టాలని తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడుకి పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news