చంద్రబాబు తలుచుకుంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ పార్టీలో వుండరు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు ఏపీ మంత్రి ఫరూక్. నంద్యాలలో మంత్రి ఫరూక్ సంచలన కామెంట్స్ చేశారు. సి.ఎం.చంద్రబాబు తలుచుకుంటే , వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ్వరూ పార్టీలో వుండరని హెచ్చరించారు మంత్రి ఫరూక్. ఆ దెబ్బకు జగన్ ఒంటరివాడవుతాడని చురకలు అంటించారు మంత్రి ఫరూక్. ఇప్పటికే వైసీపీ నేతలు పక్క చూపులు చూస్తున్నారని చురకలు అంటించారు మంత్రి ఫరూక్.
వైసీపీ ఎమ్మెల్యేలు , నేతలు జగన్ శాడిజాన్ని భరించలేకున్నారు..వినుకొండలో వివాహేతర సంబంధం వల్లనే రౌడీ షీటర్ రషీద్ హత్య అన్నారు మంత్రి ఫరూక్. టీడీపీ ప్రభుత్వ హయాంలో 36 మంది హత్యకు గురైనట్లు జగన్ అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు మంత్రి ఫరూక్. హత్యకు గురైన వారి పేర్లను, ఎఫ్ఐఆర్ లను జగన్ వెల్లడించాలన్నారు మంత్రి ఫరూక్. మైనార్టీలకు కేటాయించిన నిధులను నవరత్నాలకు మళ్లించి అన్యాయం చేశారని ఆగ్రహించారు మంత్రి ఫరూక్.