మాట నిలబెట్టుకున్న రేవంత్.. విద్యుత్తు విచారణ కమిషన్కు కొత్త ఛైర్మన్‌

-

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. త్వరలోనే విద్యుత్ విచారణ కమిషన్కు కొత్త ఛైర్మన్ను నియమిస్తామని అసెంబ్లీలో మాటిచ్చారు. అన్నట్టుగానే మంగళవారం రోజున ఆయన ఆ హామీ నిలబెట్టుకున్నారు. యాదాద్రి, భదాద్రి థర్మల్‌ విద్యుత్కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్‌గఢ్‌ నుంచి కరెంటు కొనుగోలుకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై నిజానిజాలు తేల్చేందుకు ఏర్పాటు చేసిన విచారణ కమిషన్‌కు ఛైర్మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ను నియమించింది.

ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం రోజున ఉత్తర్వులు జారీచేసింది. గతంలో ఈ కమిషన్‌ ఛైర్మన్‌గా ఉన్న జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్‌ లోకూర్‌ బాధ్యతలు స్వీకరించనున్నారు. జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ ఏర్పాటును సవాలు చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. ఈ కేసు విచారణ సమయంలోనే జులై 16న జస్టిస్‌ ఎల్‌.నరసింహారెడ్డి కమిషన్‌ ఛైర్మన్‌ పదవి నుంచి తప్పుకొంటూ రాజీనామా లేఖ పంపారు. ప్రస్తుతం ఆయన స్థానంలో కమిషన్‌ ఛైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ను ప్రభుత్వం నియమించింది.

Read more RELATED
Recommended to you

Latest news