బ్రాండ్ కంపెనీలకు లీగల్ నోటీసులు పంపిన మనుభాకర్

-

భారత నంబర్ వన్ మహిళా షూటర్, మను భాకర్.. సోషల్ మీడియాలో సవాళ్ళను ఎదురుకుంటోంది. భాకర్ పారిస్ ఒలింపిక్స్ 10 మీటర్ ఎయిర్ పిస్టల్ విభాగంలో రెండు కాంస్య పతకాలు సాధించిన తరుణంలో చాలా బ్రాండ్ కంపెనీలు ఆమె సాధించిన విజయానికి అభినందనలు తెలియజేస్తున్నాయి. ఈ క్రమంలో.. కొన్ని బ్రాండ్ కంపెనీలు తమ వస్తువులను ప్రమోట్ చేసుకోవడానికి ఆమె ఫోటోలను చట్టవిరుద్ధంగా వాడుకుంటున్నాయి. ఈ సందర్భంగా ఆయా కంపెనీలకు ఆమె లీగల్ నోటీసులు జారీ చేసినట్లు  సమాచారం.

భాకర్ వ్యవహారాలను నిర్వహించే IOS స్పోర్ట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ MD నీరవ్ తోమర్, ది ఎకనామిక్ టైమ్స్ మాట్లాడుతూ.. ‘మనుతో సంబంధం లేని దాదాపు 12 బ్రాండ్లు ఆమె చిత్రాలతో కూడిన అభినందన ప్రకటనలను సోషల్ మీడియాలో విడుదల చేశాయని ఆయన వెల్లడించారు. ఈ బ్రాండ్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తోమర్ చెప్పారు. కాగా.. పారిస్ విశ్వ క్రీడలలో ఇతర ఇండియన్ ఆటగాళ్లు కూడా ఇటువంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. బాక్సర్ నిఖత్ జరీన్, బ్యాడ్మింటన్ క్రీడాకారులు చిరాగ్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్ రాంకిరెడ్డి వంటి అథ్లెట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న బేస్లైన్ వెంచర్స్ ప్రతినిధి మాట్లాడుతూ.. తమ అనుమతి లేకుండా ఎవరైనా అథ్లెట్ల ఫోటోలను కంపెనీలు తమ ప్రకటనలకు ఉపయోగిస్తే, వాటిపైన చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం’ అని మీడియాతో వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news