అమరావతి రైతుల కొంప ముంచుతున్న ఐఫోన్లు,పట్టు చీరలు ఎలా అంటారా…?

-

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది. రాజధానిని తరలించవద్దని కోరుతూ రాజధాని ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు. దాదాపు మూడు వారాల నుంచి ఈ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతుంది. రాజకీయంగా కూడా వీరి ఉద్యమం తీవ్ర స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమ౦ వెనుక తెలుగుదేశం నేతలు ఉన్నారని వాళ్ళ భూములు కాపాడుకోవడానికే ఈ విధంగా రైతులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అధికార వైసీపీ ఆరోపిస్తుంది.

ఇక ఇదిలా ఉంటే రాజధాని ప్రాంత రైతులను ఇప్పుడు ఒక సమస్య తీవ్రంగా ఇబ్బంది పెడుతుంది. రాజధాని ఉద్యమంలో పాల్గొనే మహిళలు కొందరు ధనికులు కావడమే అసలు సమస్య. రాజధానిగా అమరావతిని ప్రకటించిన తర్వాత అక్కడ భూముల ధరలు కొంత వరకు పెరిగాయి. కొంత కాదులే గాని భారీగానే పెరిగాయి. తర్వాత ప్రభుత్వం తిరిగి ఇచ్చిన స్థలాలను అక్కడి రైతులు భారీగా అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. రాత్రికి రాత్రే ధరలు పెరగడంతో వాళ్ళు ఎక్కువగానే జాగ్రత్తపడ్డారు.

కొంత అమ్ముకుని కొంత తర్వాత అమ్ముకుందాం అని భావించిన వాళ్లకు ప్రభుత్వ నిర్ణయం చుక్కలు చూపించింది. మిగిలిన భూమి ధర భారీగా పడిపోయింది. దీనితో రాజధాని ప్రాంతంలో ధనికులు ఎక్కువగా ఉద్యమంలో హైలెట్ అవుతున్నారు. వాళ్ళు పట్టు చీరలు కట్టుకుని రావడం, చేతిలో ఐఫోన్ లు ఉండటం, వారినే మీడియా పలకరించడంతో అది రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకు దారి తీసింది. ఉద్యమం చేస్తున్న వాళ్ళు అందరూ ధనికులే అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చేసింది. ఇప్పుడు ఇదే రాజధాని రైతులకు చికాకుగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news