ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌: ఉత్తమ చిత్రం బలగం.. ఉత్తమ నటుడు నాని

-

69వ శోభ ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ సౌత్ -2024  వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన నటీనటులు ఈ వేడుకకు హాజరయ్యారు. బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘బలగం’ ఉత్తమ చిత్రంగా నిలవడంతో పాటు, ఉత్తమ దర్శకుడిగా వేణు అవార్డు అందుకున్నారు.

69 ఫిల్మ్‌ఫేర్‌ అవార్డ్స్‌ 2024 తెలుగు విజేతలు..

ఉత్తమ చిత్రం: బలగం

ఉత్తమ నటుడు: నాని (దసరా)

ఉత్తమ నటి: కీర్తి సురేష్‌ (దసరా)

ఉత్తమ దర్శకుడు: వేణు యెల్దండి (బలగం)

ఉత్తమ పరిచయ దర్శకుడు: శ్రీకాంత్‌ ఓదెల (దసరా), శౌర్యువ్‌ (హాయ్‌నాన్న)

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్‌): సాయి రాజేష్‌ (బేబీ)

ఉత్తమ నటి (క్రిటిక్స్‌): వైష్ణవి చైతన్య (బేబీ)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్‌): నవీన్‌ పొలిశెట్టి (మిస్‌ శెట్టి, మిస్టర్‌ పొలిశెట్టి), ప్రకాశ్‌రాజ్‌ (రంగమార్తాండ)

ఉత్తమ సహాయ నటుడు: రవితేజ (వాల్తేరు వీరయ్య), బ్రహ్మానందం (రంగమార్తాండ)

ఉత్తమ సహాయ నటి: రూప లక్ష్మీ (బలగం)

ఉత్తమ గాయకుడు: శ్రీరామచంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)

ఉత్తమ గాయని: శ్వేత మోహన్‌ (మాస్టారు.. మాస్టారు.. సార్‌)

ఉత్తమ గేయ సాహిత్యం: అనంత్‌ శ్రీరామ్‌ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా.. బేబీ)

ఉత్తమ సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌ (బేబీ)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: సత్యన్‌ సూరన్‌ (దసరా)

ఉత్తమ ప్రొడక్షన్‌ డిజైన్‌: కొల్లా అవినాష్‌ (దసరా)

ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్‌ రక్షిత్‌ (ధూమ్‌ ధామ్‌ దోస్తానా.. దసరా)

Read more RELATED
Recommended to you

Latest news