గోల్కొండ ఓఆర్ఆర్ వద్ద 800 కిలోల గంజాయి పట్టివేత

-

రాష్ట్రంలో పోలీసులు గంజాయి, డ్రగ్స్పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేపడుతూ వాటిని స్మగ్లింగ్ చేసే వారి ఆట కట్టిస్తున్నారు. అయినా రోజు ఏదో ఒక చోట మత్తుపదార్థాలు సరఫరా చేస్తూ నిందితులు పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ పెద్ద గోల్కొండ వద్ద అవుటర్ రింగ్ రోడ్డు పై భారీగా గంజాయి పట్టుబడింది. పెద్ద అంబర్పేట్ వైపు నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ కంటైనర్లో దాదాపు 800 కిలోల గంజాయిని బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి గంజాయిని తరలిస్తున్నట్లుగా గుర్తించారు. కంటైనర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

హైదరాబాద్‌ పెద్దగోల్కొండ వద్ద అంబర్‌పేట్‌ నుంచి  గచ్చిబౌలి వైపు వెళ్తున్న ఓ కంటైనర్‌లో దాదాపు 800 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ డీసీపీ రాజేశ్ తెలిపారు. నిందితులు ఒడిశా నుంచి గంజాయి తరలిస్తున్నట్లుగా గుర్తించామని చెప్పారు. వాహనాల తనిఖీల్లో గతంలో చాలా సార్లు గంజాయి పట్టుకున్నామని కానీ కంటైనర్‌లో గంజాయి రావడం ఇదే మొదటిసారి అని శంషాబాద్ డీసీపీ రాజేశ్‌ వివరించారు.  నిందితుడిని విచారించాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news