వైసీపీకి షాక్.. ఇసుక అక్రమాలపై సీఐడీ విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం

-

ఉచిత ఇసుక విధానం, తాగునీటి విషయాల్లో కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలోని ఇసుక అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటన చేశారు. కలెక్టర్ల కాన్పరెన్స్ లో చంద్రబాబు మాట్లాడుతూ… గత ప్రభుత్వంలో జరిగిన ఇసుక అక్రమాలపై సీఐడీ ఎంక్వైరీ వేస్తామని ప్రకటించారు. ఉచిత ఇసుక విధానం అమలులో జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అక్రమాలు జరిగితే సహించనని వార్నింగ్‌ ఇచ్చారు.

AP Vision Document 2047 released on 2nd October

ఇసుక అక్రమాలను చూస్తూ ఊరుకున్న కలెక్టర్లను కాల్ బ్యాక్ చేస్తానని… ఇసుక రవాణా ఛార్జీల్లో సమస్యలు వస్తున్నాయన్నారు. ఇసుక వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా వ్యవహరించొద్దు అని… ఇసుక సరఫరాలో పూర్తి పారదర్శకత పాటించాలని ఆదేశాలు ఇచ్చారు. ఇసుక సరఫరాలో ప్రతి స్టెప్ ను డిజిటలైజేషన్ చేస్తామన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులను సస్పెండ్ చేసేస్తాం….ఇటీవల హంద్రీ నీవా కాల్వలకు నీటి విడుదల విషయంలో స్ధానిక అధికారులు నిర్లక్ష్యం వహించారని తెలిపారు. ప్రాజెక్టుల నిర్వహణ, నీటి ఇన్ ఫ్లోస్ పై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి….అవసరమైతే డ్రోన్లు వాడండని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news