ఏపీని పునర్ నిర్మాణం చేద్దాం..కలెక్టర్లకు చంద్రబాబు కీలక ఆదేశాలు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కలెక్టర్ల సమావేశంలో తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.  ముఖ్యంగా ఏపీని పునర్ నిర్మాణం చేద్దామని ఆదేశాలు జారీ చేశారు.  రాబోయే రోజుల్లో వర్షాలకు వేసిన పంట మొత్తం మునిగిపోతుంది. దానికి ఏం చేయాలో ప్రణాళికలు వేయాలి. వర్షాలు బాగా కురుస్తున్నాయి. వాటర్ సమస్య ఈ ఏడాది ఉండదు.

నదుల అనుసంధానం చేస్తాం. గత ప్రభుత్వ హయాంలో అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా ఏ ఒక్క తప్పు జరిగినా ఆ చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది. కాబట్టి దానిని దృష్టిలో పెట్టుకొని ప్రతీ జిల్లా కలెక్టర్ వ్యవహరించాలి. అసలు తప్పులు జరుగకుండా జాగ్రత్త పడాలి. ఉచిత ఇసుక విధానంలో కలెక్టర్లు తప్పులు చేస్తే క్షమించమని సీఎం చెప్పారు. అధికారులు తప్పు చేసినా ఎవ్వరూ క్షమించరు. ఉచిత ఇసుక విధానాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటున్నానని తెలిపారు. ఉచిత ఇసుక విధానం పారదర్శకంగా ఉండాలని సూచించారు. గత ప్రభుత్వ ఇసుక పాలసీ పై సీఐడీ విచారణకు ఆదేశించినట్టు తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Latest news