ఏపీ సీఎం చంద్రబాబు చీరాల పర్యటన రద్దు

-

AP CM Chandrababu’s sari tour canceled: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చీరాల పర్యటన లో ట్విస్ట్ నెలకొంది. ఇవాళ చీరాలకు వెళ్లాల్సిన చంద్రబాబు నాయుడు తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ మేరకు అధికారులు అధికారిక ప్రకటన చేశారు. చేనేత దినోత్సవం లో పాల్గొనేందుకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల సమయానికి చీరాలకు చంద్రబాబు నాయుడు వెళ్లాల్సి ఉండేది.

 

AP CM Chandrababu’s sari tour canceled

కానీ చీరాలలో భారీ వర్షం కురుస్తోంది. అయితే భారీ వర్షం నేపథ్యంలో… చంద్రబాబు పర్యటించడం అంత మంచిది కాదని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారట. దీంతో చంద్రబాబు నాయుడు చీరాల పర్యటన వాయిదా వేసుకున్నారు. దీంతో విజయవాడలో నిర్వహించే చేనేత దినోత్సవం లో చంద్రబాబు పాల్గొన్నారని అధికారులు ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చీరాలకు వెళ్లిన చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే… ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తామని ఇప్పటికే ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news