మోహన్ బాబు యూనివర్సిటీకి ఇస్రో ఛైర్మన్..!

-

మోహన్ బాబు యూనివర్సిటీలో రెండు రోజుల జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు జరిగాయి. ఇస్రో, మోహన్ బాబు యూనివర్సిటీల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ నేషనల్ స్పేస్ డే సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, యూనివర్సిటీ ఛైర్మన్ మంచు మోహన్ బాబు.

23 ఆగష్టు 2023లో చంద్రయాన్ -3 ప్రయోగం విజయవంతం అయ్యిందని పేర్కొన ఇస్రో ఛైర్మన్ సోమనాథ్.. ప్రధాన నరేంద్రమోడీ ఆగష్టు 23వ తేదీని అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు అని తెలిపారు. ఆ తేదీన 7 లక్షల మంది లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా కోట్ల మంది ప్రజలు ప్రయోగాన్ని వీక్షించారు. ఎవరి సహాయం లేకుండా విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ టెక్నాలజీలను తయారు చేసింది మన భారతీయులే. ఇక ఇదే విధంగా భవిష్యత్తులో మరింత ఎఫోర్ట్ పెట్టాలి.. అలాగే 2040లో మనం మరిన్ని ప్రయోగాలు చేయాబోతున్నాం అని ఇస్రో ఛైర్మన్ అయిన సోమనాథ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news