ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్‌..త్వరలోనే కరెంట్‌ ఛార్జీల తగ్గింపు !

-

ఏపీలో విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని అదిరిపోయే శుభవార్త చెప్పారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. 24 గంటల పాటు వినియోగదారులకు విద్యుత్ ను అందిస్తామని…. రైతులకు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని ప్రకటించారు. ఒక్క మెగా వాట్ కూడా కొత్త విద్యుత్ ఉత్పత్తిని తీసుకురాలేదని వెల్లడించారు. కొత్త విద్యుత్ ఉత్పత్తి తీసుకురాక పోవడం వల్ల గతంలో విద్యుత్ చార్జీల ధరలు పెరిగాయన్నారు.

6 నుంచి 7శాతం విద్యుత్ వాడకం పెరుగుతోంది… విద్యుత్ ఛార్జీలను తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. నూతన విద్యుత్ ప్లాంట్లు, సోలార్ విద్యుత్, రైతులకు కుసుమ్ యోజన పథకాన్ని ఏ విధంగా అందించాలన్న దానిపై అధ్యయనం చేస్తున్నామని… దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం వ్యక్తిగతం..మేమెక్కడా శ్రీనివాస్ ను విమర్సించడం లేదని వివరించారు. మమ్మల్ని ఇబ్బందులు పెట్టిన వైసిపి ముఖ్య నేతల పట్ల కక్షపూరితంగా వ్యవహరించలేదని… వైసిపి నేతలు మాపై బురదజల్లాలని చూస్తున్నారని ఆగ్రహించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్.

Read more RELATED
Recommended to you

Latest news