లిక్కర్ ఈడి కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ ను సెప్టెంబర్ 2 వరకు పొడిగించింది రౌస్ ఏవిన్యూ స్పెషల్ కోర్ట్. అయితే రౌజ్ ఏవెన్యూ కోర్టులో ఎమ్మెల్సీ కవిత తరఫున వాదనలు వినిపించారు మోహిత్ రావు. సెక్షన్ 50 PMLA లో భాగంగా సాక్షులను ఒత్తిడి చేసి తప్పుడు వాంగ్మూలాలను నమోదు చేశారు. సాక్ష్యులు, అప్రూవర్ల వాంగ్మూలం నమోదు చేసిన సమయంలో చిత్రీకరించిన వీడియోల, ఆడియోలను మాకు ఇవ్వండి అని కోరారు కవిత తరఫు న్యాయవాది.
ఒత్తిడి చేసి నమోదు చేసిన వాంగ్మూలాలు న్యాయపరంగా చెల్లుబాటు కావన్న కవిత తరఫు న్యాయవాది.. శరత్ చంద్రా రెడ్డి ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కవితపై ఈడీ ఆరోపణలు చేయడం సరికాదు అని పేర్కొన్నారు. అదే విధంగా శరత్ చంద్రా రెడ్డితో ఏవో లావాదేవీలు జరిగాయని ఈడీ అంటోంది కానీ… అనేక సంవత్సరాల నుంచి వారి మధ్య ఆర్ధిక లావాదేవీలు ఉన్నాయని, అవి కూడా బ్యాంక్ లావాదేవీలు అని కవిత తరఫు న్యాయవాది మోహిత్ రావ్ పేర్కొన్నారు.