పీసీసీ అధ్యక్ష రేసులో మహబూబాబాద్‌ ఎంపీ బలరాంనాయక్‌!

-

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా కొత్త వ్యక్తి నియామకంపై ఇప్పటికే కసరత్తు మొదలైంది. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైనందున పీసీపీ పగ్గాలు వేరే చేతిలో పెట్టాలని హైకమాండ్ యోచిస్తున్నట్లు సమాచారం. అయితే అధ్యక్ష రేసులో ఇప్పటికే డజనుకుపైగా మంది ఉన్నారు. వారంతా దిల్లీలో లాబీయింగ్ పనిలో బిజీ అయ్యారు. తాజాగా పీసీపీ అధ్యక్ష పదవి రేసులో తానూ ఉన్నానని చెప్పారు మహబూబాబాద్‌ ఎంపీ పోరిక బలరాంనాయక్‌.

రాష్ట్రంలో అత్యధిక నియోజకవర్గాల్లో ఉన్న గిరిజనులకు టీపీసీసీ అధ్యక్షుడిగా ఈసారి అవకాశం కల్పించాలని ఆయన పార్టీ అధిష్ఠానాన్ని కోరారు. కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడిగా, కేంద్ర సహాయ మంత్రిగా పని చేసిన అనుభవంతోపాటు పార్టీకి కట్టుబడి పనిచేస్తున్నానని హైకమాండ్కు తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 అసెంబ్లీ స్థానాల్లో గిరిజనులు అధికంగా ఉన్నారని.. వారంతా ముందు నుంచీ కాంగ్రెస్‌ పార్టీని నమ్ముకొని ఉన్నారని వెల్లడించారు. ఇప్పటివరకు పీసీసీ అధ్యక్షుడిగా గిరిజనులకు అవకాశం కల్పించలేదని పేర్కొన్నారు. అందువల్ల ఈ పర్యాయం నియమించాలని అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news