డెకాయ్ ఆపరేషన్ పై హైదరాబాద్ కమిషనర్ వివరణ..!

-

డెకాయ్ ఆపరేషన్స్ పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక కామెంట్స్ చేసారు. ఈ డెకాయ్ ఆపరేషన్స్ లో ఈ మధ్యకాలంలో 27 మంది స్నాచేర్స్ ను పట్టుకున్నాం అని పేర్కొన్నారు. గోల్డ్ చైన్ స్నాచింగ్, మొబైల్ ఫోన్ స్నాచింగ్ చోరీల కేసులో చాలా వరకు రిసీవర్స్ ఆట కట్టించాం. రోజు అయ పోలీస్ స్టేషన్ లలో ఈ మధ్య కాలంలో స్నాచింగ్ కేసులు అధికమయ్యాయి.

అయితే హైదరాబాద్ లో డెకాయ్ ఆపరేషన్ లో భాగంగా మా పోలీస్ టీమ్స్ రెండు ఓపెన్ ఫైర్ చేసిన ఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ లో స్నాచింగ్ కేసులు పూర్తిగా అదుపులోకి వచ్చాయి అని పేర్కొన్నారు. అలాగే రేపు గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశాం అని కూడా తెలిపారు. 4,000 మంది పోలీసులు బందోబస్తు చేపట్టాం. అదనంగా గ్రే హౌండ్స్ & ఆక్టోపస్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి అని తెలిపారు

Read more RELATED
Recommended to you

Latest news