నేడు సీతారామ ప్రాజెక్టు పంప్‌హౌస్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

-

ఖమ్మం జిల్లా ప్రజలకు శుభవార్త. సీతారామ ప్రాజెక్టు పంప్‌ హౌస్‌ను నేడు సీఎం రేవంత్‌ రెడ్డి ప్రారంభించనున్నారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు గోదావరి జలాలే లక్ష్యంగా పంప్‌హౌస్‌ల నిర్మాణం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీతారామ ప్రాజెక్టు ద్వారా 9.20 లక్షల ఎకరాల ఆయకట్టుకు గోదావరి జలాలు అందనున్నాయి. ప్రాజెక్టు మూడు పంప్‌హౌస్‌ల నిర్మాణం పూర్తైంది. ఈ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సీతారామ పంపుహౌస్‌-2ను స్విచ్చాన్‌ చేసి ఎత్తిపోతలను ప్రారంభిస్తారు.

ఇవాళ జరిగే ఈ ప్రారంభోత్సవంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ కుమార్‌ రెడ్డి, జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొననున్నారు. కమలాపుర్ పంప్‌హౌస్‌ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, బీజీ కొత్తూరు తొలిపంప్ హౌస్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news