తెలంగాణ మహిళలకు 2 లక్షల రుణమాఫీ, 10 లక్షల బీమా – సీఎం రేవంత్‌ ప్రకటన

-

తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్‌ శుభవార్త చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…ఇందిరా మహిళా శక్తి పథకంలో భాగంగా రుణబీమా పథకాన్ని కూడా గత మార్చి నుంచి అమలు చేస్తున్నామన్నారు. ఈ పథకం కింద సభ్యురాలు ఎవరైనా మరణించినప్పుడు ఆమె పేరున ఉన్న రుణాన్ని గరిష్టంగా రెండు లక్షల రూపాయల వరకు మాఫీచేయడం జరుగుతుందని ప్రకటించారు.

2 lakh loan waiver and 10 lakh insurance for Telangana women

స్వయం సహాయక బృందాల మహిళా సభ్యులకు స్కూల్ యూనిఫారాలు కుట్టే పనిని అప్పగించడంతో పాటు, వారి ఉత్పత్తుల విక్రయానికి మాదాపూర్ లోని శిల్పారామం వద్ద డ్వాక్రా మహిళా బజార్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందిరా జీవిత బీమా పథకం ద్వారా స్వయం సహాయక సంఘాలలోని దాదాపు 63.86 లక్షల మంది మహిళా సభ్యులకు జీవిత బీమా సౌకర్యం కల్పిస్తున్నాం. స్వయం సహాయక సంఘాలలోని సభ్యులకు 10 లక్షల ప్రమాద జీవిత బీమా చేయడం జరిగిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news