రాష్ట్రంలో త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు : సీఎం రేవంత్

-

తమ ప్రభుత్వం విద్యా రంగంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం వివిధ రకాల కార్యక్రమాలు తీసుకురాబోతున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే రాష్ట్రంలో త్వరలో విద్యా కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అంగన్వాడిలను ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చబోతున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కోసం ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మించబోతున్నామని తెలిపారు. బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్లను నిర్మిస్తామని హామీ ఇచ్చారు.

78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఇటీవలే స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేసుకున్నాం. స్కిల్ వర్సిటీ విప్లవాత్మక మలుపు కాబోతోంది. స్కిల్ వర్సిటీకి ఆనంద్ మహీంద్రాను ఛైర్మన్‌గా నియమించాం. తెలంగాణను ప్రపంచానికి ముఖద్వారంగా మార్చాలి. తెలంగాణ బ్రాండ్ ను విశ్వవేదిక పై సగర్వంగా చాటాలి. పెట్టుబడుల సాధన కోసం అమెరికాలో పర్యటించాం. అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమయ్యాను. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు ప్రపంచబ్యాంక్ అంగీకరించింది.’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news