BREAKING: BRS మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్‌

-

బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అరెస్ట్‌ అయ్యారు. కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను అరెస్టు చేశారు పోలీసులు. ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పర్యటన నేపథ్యంలో కొత్తగూడెంలో బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ను అరెస్టు చేశారు పోలీసులు. అశ్వాపురం బిజి కొత్తూరుకు మంత్రుల వస్తున్న నేపథ్యంలో 14 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్ చేశారు పోలీసులు.

Former BRS MLA Rega Kantha Rao has been arrested by the police in Kothagudem

ఇక అంతకు ముందే… సీఎం రేవంత్‌ పర్యటన తరుణంలో సోషల్ మీడియా వేదికగా మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు కామెంట్స్ చేశారు. జిల్లాకు సీతారామ ద్వారా సాగు నీరు ఇస్తానని సీఎం ప్రకటించక పోతే సీఎం ప్రోగ్రాం అడ్డుకుంటామని వార్నింగ్‌ ఇచ్చారు. పినపాక నియోజకవర్గానికి సాగునీలిచ్చే మారెల్లిపాడు ట్యాంక్ పనులు ఎందుకు ఆపినట్లు అని ప్రశ్నించారు. భద్రాద్రి జిల్లాకు సాగునీళ్ళు ఇవ్వకుండా పక్క జిల్లాకు తీసుకుపోతున్నందుకు జిల్లా రైతాంగానికి భేషరతుగా సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news