జమ్మూకాశ్మీర్ కి సంబంధించి తొలిసారి ఎన్నికలు జరుగనున్నాయి. తాజాగా ఎన్నికలకు సంబంధించి చీఫ్ ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ ని విడుదల చేశారు. హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల్లో సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ముఖ్యంగా ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూ కాశ్మీర్ లో తొలిసారిగా ఎన్నికలు జరుగుతున్నాయి. మూడు దశల్లో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 01న జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగనున్నాయి.
హర్యానాలో అక్టోబర్ 01న ఎన్నికలు జరుగనున్నాయి. హర్యానాలో 90 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అక్టోబర్ 04న జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు విడుదల చేయనున్నారు. ఒకే విడుతలో హర్యానాలో ఎన్నికలు నిర్వహించడం గమనార్హం. కానీ జమ్మూ కాశ్మీర్ లో మాత్రం మూడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి.