అతి త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం తథ్యం అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. విలియం అనంతరం కేసీఆర్ కు ఏఐసీసీ, కేటీఆర్ కు పీసీసీ చీఫ్, కవితకు రాజ్యసభ సీటు ఖాయం అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుని పదవులు పంచుకున్న చరిత్ర ఆ పార్టీల సొంతం. అయితే కవిత బెయిల్ కు, బీజేపీకి ఏం సంబంధం లేదు. బీఆర్ఎస్ ను వీలీనం చేసుకుంటే బెయిల్ వస్తుందనడం మూర్ఖత్వం.
ఆప్ పార్టీని విలీనం చేసుకుంటేనే సిసోడియాకు బెయిల్ వచ్చిందా అని ప్రశ్నించిన బండి.. బాధ్యతాయుత పదవుల్లో ఉంటూ న్యాయస్థానాలపై బురదచల్లుతురా అని అన్నారు. కవిత బెయిల్ పై కావాలనే బీజేపీపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుంది. అయితే కాళేశ్వరం, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్, కేటీఆర్ లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు అని అడిగిన బండి.. నువ్వు కొట్టినట్లు చేయ్.. నేను ఏడ్చినట్లు చేస్తానన్నట్లుంది కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరు అని తెలిపారు.