భారత్ స్టార్ రెజ్లర్ ఇటీవల తన జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలపై సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టింది. తన కష్ట సమయంలో వెన్నంటి మద్దతునిచ్చిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపింది. పతకం సాధించకుండానే వెనుదిరగాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.
మీ అందరికి ఓ విషయం చెప్పాలని ఉంది. పతకం కోసం నేను చాలా ప్రయత్నించాను. ప్రత్యర్థులకు లొంగకుండా పోరాడాను. కానీ కాలం కలిసి రాలేదు. అందుకే వెనుదిరగాల్సి వచ్చింది. నా భవిష్యత్ ఏంటో తెలియడం లేదు. బహుశా 2032 వరకు కుస్తీ పట్టగలనని అనుకున్నా.. కానీ ఇప్పుడు నా కోసం ఏం ఎదురుచూస్తుందో తెలియడం లేదు. కానీ నేను నమ్మిన దానికోసం నిరంతరం పోరాడుతూనే ఉంటా అని వినేశ్ తన పోస్టులో రాసుకొచ్చింది.
ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల తరఫున పారిస్ వెళ్లిన వైద్య బృందంలో ఒకరైన డాక్టర్ దిన్‌షా పార్దివాలాను ఉద్దేశించి వినేశ్ ఆయన దేవదూత అని కొనియాడింది. ‘ఇండియన్ అథ్లెట్లకు పార్దివాలా కేవలం ఒక డాక్టర్ మాత్రమే కాదు. దేవుడు పంపించిన వ్యక్తి. నా ప్రాక్టీస్ సందర్భంగా గాయాలై తనమీద తనకు నమ్మకం కోల్పోయిన సమయంలో ఎంతో ధైర్యం అందించి మళ్లీ బరిలోకి దిగేవిధంగా ఎంతో ప్రోత్సహించారు.’ అని డాక్టర్‌పై వినేశ్ కురిపించింది.