హరీశ్ రావు ఇంటిపై దాడి.. కేటీఆర్ ట్వీట్ వైరల్

-

సిద్దిపేటలో శుక్రవారం అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. రుణమాఫీ అయిందంటూ.. హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ కాంగ్రెస్‌ నేతలు ఫ్లెక్సీలు పెట్టారు. వాటిని బీఆర్ఎస్ శ్రేణులు తొలగిస్తున్న సమయంలో ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘటన తర్వాత మాజీ మంత్రి హరీశ్ రావు ఓ ట్వీట్ చేశారు. తన అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్‌ శ్రేణులు దాడి చేశాయని ఆరోపించారు. తాళాలు పగులగొట్టి.. ఆస్తులు ధ్వంసం చేయడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. ఎమ్మెల్యేకే భద్రత లేకపోతే.. పౌరులకు భరోసా ఏదని ప్రశ్నించారు.

ఈ ఘటనపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు.  సీనియర్ ఎమ్మెల్యేకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఎలా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు.  గత పదేళ్లలో ఇలాంటి కక్ష సాధింపులు లేవని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నీచంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రజలు ఇదంతా గమనిస్తున్నారని.. సరైన సమాధానం చెబుతారని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.. మరో పోస్టులో ప్రేమ బజార్‌లో ద్వేషపు దుకాణం నడిపిస్తున్నారని చురకలంటించారు.

Read more RELATED
Recommended to you

Latest news