సిద్దిపేటలో ప్లెక్సీ వార్.. హరీశ్ రావు సంచలన ట్వీట్..!

-

సిద్దిపేట జిల్లాలో అర్థరాత్రి ప్లెక్సీల వార్ నడిచింది. ఆగస్టు 15న రూ.2లక్షల రుణమాఫీ నిధులు విడుదల చేయడంతో హరీశ్ రావు రాజీనామా చేయాలని ప్లెక్సీలు కట్టారు కాంగ్రెస్ నేతలు. దీంతో కాంగ్రెస్-బీఆర్ఎస్ నేతల మధ్య ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.  చేయాలి చేయాలి హరీశ్ రావు రాజీనామా చేయాలనే అనే నినాదాలతో కాంగ్రెస్ నేతలు పిలుపునిచ్చారు. ఈ ఘటన పై తాజాగా మాజీ మంత్రి హరీశ్ రావు ఓ ట్వీట్ వేశారు.

సిద్దిపేట ఎమ్మెల్యే అధికార నివాసంపై కాంగ్రెస్ గూండాలు అర్ధరాత్రి దాడి చేయడం అన్యాయానికి నిదర్శనం. తాళాలు పగులగొట్టి ఆస్తులను ధ్వంసం చేయడం అప్రజాస్వామికమే కాకుండా తీవ్ర ఆందోళనలు రేకెత్తిస్తోంది.ఈ దాడిని అడ్డుకునేందుకు పోలీసులు జోక్యం చేసుకోకుండా, నిందితులకు రక్షణ కల్పించినట్లు తెలుస్తోంది. ఒక ఎమ్మెల్యే నివాసాన్ని ఇంత నిర్మొహమాటంగా టార్గెట్ చేయగలిగితే, పౌరులకు వారి స్వంత భద్రత గురించి ఏ భరోసా ఉంది? అని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. తెలంగాణ డీజీపీకి ట్వీట్ చేశారు. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news