రేపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం

-

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 18న ఆదివారం రోజు కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తెలంగాణ కోటాలో రాజ్యసభ స్థానానికి సీనియర్ నేత కె.కేశరావు రాజీనామా చేయడంతో వచ్చే నెల 3న ఉప ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ అభ్యర్థిత్వాన్ని ఇటీవల హైకమాండ్ ధృవీకరించింది. దీంతో ఈ స్థానంలో అభిషేక్ ను గెలిపించడమే సీఎల్ఎఫ్ సమావేశంలో ప్రధాన ఎజెండా. దీంతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు, రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, సంక్షేమ పథకాలపై చర్చించనున్నట్టు సమాచారం.

అదేవిధంగా రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు తీరును ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వీ భేటీ అయ్యారు.  ఢిల్లీలోని సీఎం అధికారిక నివాసానికి వచ్చిన సింఘ్వీ.. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి  కృతజ్ఞతలు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news