బాబాయినీ ఇరికించెందుకు అబ్బాయి కిడ్నాప్ డ్రామా..!

-

రాజన్న సిరిసిల్లలో గంగరాజు కట్టుకథ వీడింది. ఘనుడు గంగరాజు పోలీస్ లాగే బురిడీ కొట్టించాడు. కిడ్నాప్ డ్రామాగా పోలీసులు తేల్చేశారు. భూ సమస్యలతో తన బాబాయి కుటుంబ సభ్యులను ఇరికించేందుకు ప్లాన్ వేసినట్టు గుర్తించారు. రెండు రోజుల పాటు కిడ్నాప్ అంటూ హైడ్రామా ఆడాడు. చందుర్తి మండలం ఆసిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఎక్కల గంగరాజు అనే యువకుడు అదృశ్యం డ్రామాగా నడిచింది. పొలం వద్ద ద్విచక్ర వాహనం, చెప్పులు, సెల్ ఫోన్ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఎవరైనా హత్య చేసి ఉంటారా..? లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కరీంనగర్ కి చెందిన గజఈత గాళ్లతో బావిలో వెతికించారు. 

కిడ్నాప్ తెల్లవారుజామున తన పొలం కొంత దూరంలో గంగరాజు కాళ్లు, చేతులు కట్టేసుకొని చిన్న గాయాలతో బురద అన్న గడ్డిలో ప్రత్యక్షమయ్యాడు. గుర్తు తెలియని వ్యక్తులు కాళ్లను చేతులను కట్టేసి అడవిలో వదిలి వెళ్లిపోయారని పోలీసులు తెలిపాడు గంగరాజు. అతనిపై పోలీసులకు అనుమానం వచ్చి విచారణ చేయగా.. తన బాబాయి ఎక్కల దేవి రాజయ్యతో భూ వివాదాలుండటంతో క్రిమినల్ కేసుల్లో ఇరికించాలని ప్లాన్ వేసినట్టు విచారణలో వెల్లడి అయింది.

Read more RELATED
Recommended to you

Latest news