సీఎం చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణనికి నిధులు అందించే విషయమై చర్చలు జరిపారు. అయితే అమరావతి నిర్మాణానికి రూ. 15 వేల కోట్ల నిధులు అందిస్తామని కేంద్ర ప్రభుత్వం మాట ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక కేంద్ర ప్రకటన తర్వాత అమరావతిలో తొలిసారి పర్యటిస్తున్నారు ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు. ప్రాథమికంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులు, దశలవారీగా నిధుల విడుదలపై సీఎంతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ చర్చలు జరిపారు.
అమరావతి ప్రాజెక్టులో పనుల పురోగతి, క్షేత్ర స్థాయి పర్యటనలు, భూ సమీకరణ, మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల అంశాలపై చర్చ జరిగింది. అలాగే రాజధాని పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులు, విధాన నిర్ణయాలను ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులకు వివరించనున్నారు సీఎం చంద్రబాబు. సీఆర్డీఏ పరిధిలో క్షేత్ర స్థాయిలో పర్యటించిన ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు… ఈ నెల 27వ తేదీ వరకు ఏపీలో పర్యటించనున్నారు.