విషజ్వరాలు వస్తుంటే..కాంగ్రెస్‌ కు చీమ కుట్టినట్లు లేదు – హరీష్‌ రావు

-

విషజ్వరాలు వస్తుంటే..కాంగ్రెస్‌ కు చీమ కుట్టినట్లు లేదని ఆగ్రహించారు హరీష్‌ రావు. డెంగీ, మలేరియా, గన్యా వంటి విషజ్వరాలతో రాష్ట్రం వణుకుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేకపోవడం శోచనీయమని మండిపడ్డారు. డెంగీ జ్వరాల బారిన పడి 24 గంటల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం అని చెప్పారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, రాష్ట్ర ప్రజలకు శాపంగా మారుతున్నదని వెల్లడించారు.


ఇలాంటి పరిస్థితులు వస్తాయని ముందే ప్రభుత్వాన్ని హెచ్చరించామని గుర్తు చేశారు. నిధులు విడుదల చేసి పారిశుద్ద్య నిర్వహణ కొనసాగించాలని, ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యమివ్వాలని వానాకాలం ప్రారంభంలోనే కోరామన్నారు హరీష్‌ రావు. కానీ ప్రభుత్వం మా సూచనలను పెడచెవిన పెట్టింది. సకాలంలో చర్యలు తీసుకొని ఉంటే విషజ్వరాలు ఇంతగా విజృంబించేవి కావని చురకలు అంటించారు. ఏటా వానాకాలం ప్రారంభంలోనే పారిశుద్ధ్య చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందని తెలిపారు హరీష్‌ రావు. కానీ ఈ ప్రభుత్వం మొదటి నుంచి పూర్తి నిర్లక్ష్యం వహిస్తూ వచ్చిందని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news