BRS అంటే భారత రాష్ట్ర సమితి కాదు.. భారత రైతు సమితి కూడా : కేటీఆర్

-

BRS అంటే భారత రాష్ట్ర సమితి కాదు.. భారత రైతు సమితి కూడా అని పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. తాజాగా ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం స్పందించి ఎప్పటిలోగా ప్రక్రియను పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం సొంత నియోజవర్గమైన కొడంగల్ లో పూర్తిగా రుణమాఫీ కాలేదని ఆరోపించారు. కోస్గి ఉమ్మడి మండలంలో 20,239 రైతు ఖాతాలు ఉన్నాయని.. అందులో కేవలం 8,527 మందికి మాత్రమే రుణమాఫీ జరిగిందని జాబితాను కేటీఆర్ చూపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

రుణమాఫీ ఆందోళనలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని, బజారు భాష, చిల్లర భాషతో తాము పక్కదారి పట్టబోమనిస్పష్టం చేశారు కేటీఆర్. మరోవైపు రేవంత్ రెడ్డి ఫామ్ హౌస్ ఎక్కడ ఉందో చూపిస్తానని అన్నారు. పొంగులేటి ఫామ్ హౌస్ కూడా ఎఫ్టీఎల్ పరిధిలోనే ఉంది.. దానిని కూడా కూల్చివేస్తారా అని ప్రశ్నించారు. మంత్రుల ఫామ్ హౌస్ లతోనే కూల్చివేతలు ప్రారంభించాలన్నారు. తనకు ఫామ్ హౌస్ లేదని.. తన స్నేహితుడి ఫామ్ హౌస్ ని లీజుకు తీసుకున్నట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news