యూరిక్ యాసిడ్ లెవెల్స్ కనుక పెరిగినట్లయితే మనలో ఈ సమస్యలు ఉన్నట్లు అర్థం చేసుకోవచ్చు. ఈ ఐదు అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే యూరిక్ ఆసిడ్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోతాయి. మరి యూరిక్ ఆసిడ్ పెరిగితే ఎలాంటి సమస్యలు ఉన్నట్లు అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
గౌట్:
ఇది యూరిక్ ఆసిడ్ తో లింక్ అయి ఉంటుంది. ఇది ఒక రకమైన ఆర్థరైటిస్. కీళ్లలో యూరిక్ యాసిడ్ పేరుకు పోతుంది. విపరీతమైన నొప్పితో పాటుగా ఇతర సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. యూరిక్ యాసిడ్ బాగా ఎక్కువవడం వలన గౌట్ సమస్య కలుగుతుంది.
కిడ్నీ సమస్యలు:
దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలతో బాధపడే వాళ్లలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఒక కిడ్నీ పనిచేయకపోయినా లేదంటే ఏదైనా కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నా కూడా యూరిక్ ఆసిడ్ లెవెల్స్ పెరుగుతాయి.
మెటాబాలిక్ సిండ్రోమ్:
కార్డియా వాస్కులర్ సమస్యలతో పాటుగా టైప్ టు డయాబెటిస్ ఉండడం వలన ఈ సమస్య ఏర్పడుతుంది, యూరిక్ యాసిడ్ లో కూడా చాలా మార్పు ఉంటుంది. ఈ సమస్య ఉంటే కూడా డాక్టర్ ని వెంటనే కన్సల్ట్ చేయడం మంచిది.
హైపోథైరాయిడ్జమ్:
ఈ సమస్య ఉన్నట్లయితే ఊబకాయం, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోవడం వంటి సమస్యలు ఉంటాయి.
సోరియాసిస్:
ఇది ఎక్కువ కాలం ఉండే చర్మ సమస్య. ఈ సమస్యతో బాధపడే వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని కంట్రోల్ చేసుకోవడానికి రెడ్ మీట్, షెల్ ఫిష్, ఆల్కహాల్ వంటి వాటికి దూరంగా ఉండాలి. హైడ్రేట్ గా ఉండాలి. ఎక్కువ నీళ్లు తీసుకుంటూ ఉండాలి. బరువుని కూడా కంట్రోల్ లో ఉంచుకోవాలి