డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. ఈ నెల 23 నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. 4500 కోట్ల నిధులతో నరేగా పనులు చేస్తామని ప్రకటన చేశారు డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ఒకేసారి నిర్వహించటం దేశంలో తొలిసారి అన్నారు డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్.

సాధారణ పంచాయతీలను స్వయం శక్తి పంచాయితీలకు తీర్చి దిద్దటమే లక్ష్యమని చెప్పారు. 44 వేల కోట్లకు పైగా పనులు గత ప్రభుత్వ హయాంలో జరిగాయన్నారు. కానీ దాని రిజల్ట్స్ ఎక్కడా క్షేత్ర స్థాయిలో కనపడటం లేదని ఆగ్రహించారు. వైసీపీ వచ్చిన తర్వాత గ్రామ పంచాయితీల ఆదాయం పడిపోయిందని తెలిపారు. పంచాయతీలను బలోపేతం చేయటం మా ప్రభుత్వ లక్ష్యమన్నారు. దేశ, రాష్ట్ర అభివృద్ధిలో పంచాయితీ లు కీలకంగా మరాలనేది నా ఆలోచన అన్నారు డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్.