రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్ట్ పేరు మారుస్తే.. వీపు పగులకొడతా :సీఎం రేవంత్

-

అమిత్ షా.. మోడీని మెప్పించడానికే రాజీవ్ గాంధీ విగ్రహం తీసేస్త అంటున్నారు కేటీఆర్. ఇవాళ టీపీసీసీ ఆధ్వర్యంలో ఈడీ ఆఫీస్ ముందు మహా ధర్నా చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఎయిర్ పోర్ట్ కి రాజీవ్ గాంధీ పేరు మారుస్తాం అంటున్నారు. చెయ్ వేసి చూడు.. వీపు పగలకొట్టక పోతే పేరు మార్చుకుంట అని పేర్కొన్నారు.సెబీపై కేసీఆర్ విధానం ఏంటో ప్రజలకు చెప్పాలి.

ఎడ్యుకేషన్. ఇరిగేషన్ మా ప్రయారిటీ అని నెహ్రు పరిపాలన సాగించారు.  బ్యాంకులను రైతుల కోసం జాతీయం చేశారు ఇందిరాగాంధీ.పేదలకు భూములు ఇచ్చి ఆత్మగౌరవం పెంచారు ఇందిరాగాంధీ. సాంకేతిక రంగాన్ని పెంచి పోషించారు రాజీవ్ గాంధీ. సాంకేతిక విప్లవం తెచ్చారు రాజీవ్ గాంధీ. పీవీ లాంటి ప్రధానులు దేశం కోసం ప్రణాళికలు రచించి దేశాన్ని ముందుకు నడిపించారు. స్వతంత్ర పోరాటం కోసం గుజరాత్ నుండి గాంధీ..వల్లభాయ్ పటేల్ బయలుదేరారు. అదే గుజరాత్ నుండి ..మోడీ.. అమిత్ షా లు బయలు దేరారు. ఆ ఇద్దరినీ చూస్తే దేశం గర్విస్తుంది.. ఈ ఇద్దరు దేశం సంపద లూటీ చేస్తున్నారని వెల్లడించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news