కాంగ్రెస్ లో యువతకు ప్రాధాన్యం.. రాహుల్ మార్క్ రాజకీయం స్టార్ట్ …

-

ఒకప్పుడు ఢిల్లీని ఏలిన కాంగ్రెస్ ఇప్పుడు కష్టాల్లో ఉంది.. బిజెపి బలపడటం, వ్యూహాత్మకంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ ఉండడంతో.. కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాల్లో వెనుకబడిపోయింది.. రాహుల్ గాంధీ చేపట్టిన జోడో యాత్ర తర్వాత కాంగ్రెస్ లో కొంతమేర ఊపు వచ్చింది. తర్వాత జరిగిన కొన్ని రాష్ట్రాల ఎలక్షన్స్ కాంగ్రెస్ కి అనుకూలంగా వచ్చినప్పటికీ.. దేశవ్యాప్తంగా అనుకున్న స్థాయిలో కాంగ్రెస్ బలపడలేదు.. దీనిపై రాహుల్ గాంధీ సీరియస్ గా దృష్టి పెట్టారనే ప్రచారం నడుస్తోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ను ప్రక్షాళన చేసి తన మార్కు రాజకీయాన్ని ఇతర పార్టీలకు చూపెట్టాలని రాహుల్ గాంధీ తహతహలాడుతున్నారట.. ఈ మేరకు ఏఐసీసీ లో భారీ మార్పులు ఉండబోతున్నాయని టాక్ వినిపిస్తోంది..

రాహుల్ గాంధీ పూర్తిగా తన సొంత టీమును ఏర్పాటు చేసుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొంతమంది ప్రధాన కార్యదర్శులను తప్పించి వారి స్థానంలో యువతకు ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారట.. ఇప్పటికే 35 మందితో జాబితాను కూడా సిద్ధం చేశారని హస్తిన రాజకీయాలు తెలిసిన వారు చెబుతున్నారు.. తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా ఉన్న ప్రధాన కార్యదర్శులను మార్చి.. వారి స్థానంలో మాజీ ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించబోతున్నారని తెలుస్తోంది.. ఇదే సమయంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాలపై కూడా రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి పెట్టారట.. ఏఐసీసీలో కీలకంగా ఉన్న నేతలను.. తమ సొంత రాష్ట్రాలకు పంపించి ఎన్నికల బాధ్యతలు అప్పగించే ఆలోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది..

సీనియర్ నేతలతో పాటు, యువకులకు అలాగే మాజీ ఐఏఎస్ అధికారులకు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వాలని రాహుల్ భావిస్తున్నారట.. సీనియర్ల సలహాలు పాటిస్తూనే.. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని ఆయన ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.. బిజెపి ఎత్తులకు పైఎత్తులు వేయాలంటే.. సీనియర్లతోపాటు దూకుడుగా వ్యవహరించే యువ నేతలు కూడా ఉండాలని ఆయన భావిస్తున్నారట.. ఈ క్రమంలోనే కొద్దిరోజుల్లో మార్పులు జరగబోతున్నాయని తెలుస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news