ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. ఇవాళ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు నిర్వహించబోతుంది కూటమి సర్కార్. ఉపాధి హామీ పథకం కింద పనులు ఖరారు చేయనున్నాయి ఈ గ్రామ సభలు. ఒక రాష్ట్రంలో ఒకే రోజు గ్రామసభల నిర్వహణ తో రికార్డ్ సృష్టించనుంది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సర్కార్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు నిర్వహించనున్నారు. దేశంలోనే మొదటిసారి భారీ స్థాయిలో ఒకే రోజు గ్రామ సభల నిర్వహణ చేయనుంది బాబు సర్కార్.
ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులకు ఆమోదం తెలపనున్నారు. 9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన చేకూరనుంది. స్వయంసమృద్ధితో పంచాయతీలు కళకళలాడాలని… .గ్రామాలకు ఆదాయం, అభివృద్ధి పెంచేలా ప్రణాళికలు ఈ సందర్భంగా చేయనున్నారు. పంచాయతీల పునరుజ్జీవానికి నలుదిశలా విప్లవం తీసుకురాన్నారు. సోషల్ ఆడిట్ పకడ్బందీగా చేపడతామని ప్రభుత్వం స్పష్టం చేసింది.