కింద కూర్చుని భోజనం చేస్తే.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా..?

-

ఇప్పుడంటే ప్రతి ఒక్కరు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని భోజనం చేస్తున్నారు. కానీ పూర్వం పూర్వం మాత్రం కింద కూర్చుని భోజనం చేసేవారు. కింద కూర్చుని భోజనం చేయడం వలన చాలా లాభాలను పొందడానికి అవుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కింద కూర్చుని తినడం వలన ఎన్ని లాభాలు ఉన్నాయో తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు. కింద కూర్చుని భోజనం చేయడం వలన జీర్ణ సమస్యలు ఉండవు. బాగా జీర్ణం అవ్వడానికి ఇది సహాయం చేస్తుంది. కింద కూర్చుని భోజనం చేయడం వలన ఉదర సంబంధిత సమస్యల్ని నయం చేసుకోవచ్చు. బ్లోటింగ్ వంటి సమస్యలు కూడా ఉండవు.

కింద కూర్చుని తినడం వలన ఒత్తిడి, యాంగ్జైటీ కలిగి జీర్ణ సమస్యలు తలెత్తడం వంటి ఇబ్బందులు ఉండవు. కుర్చీలో కూర్చుని తినడం కంటే కింద కూర్చుని తినడం వలన బ్యాక్ బోన్ కి సపోర్ట్ బాగా ఉంటుంది. బ్యాక్ పెయిన్ కూడా రాకుండా ఉంటుంది. కానీ కింద కూర్చోడం వలన కంఫర్ట్ గా ఉంటుంది. పైగా వెన్నెముకపై పెద్దగా ఒత్తిడి పడదు. సర్క్యులేషన్ కూడా బాగా ఉంటుంది. కార్డియో వాస్కులర్ హెల్త్ కూడా బాగుంటుంది.

కింద కూర్చోవడం వలన వీన్స్, ఆర్టరిస్ పై ఒత్తిడి పడకుండా బ్లడ్ ఫ్లో బాగా అవుతుంది. కింద కూర్చుని తినడం వలన ప్రశాంతంగా తినొచ్చట. మానసికంగా కూడా బాగుంటుంది. ప్రశాంతంగా కింద కూర్చుని తినడం వలన బాగా ఆస్వాదిస్తూ తినొచ్చు. టేస్ట్ బాగుంటుంది. పైగా అతిగా తినడం వంటి ఇబ్బందులు ఉండవు. ఇలా పురాతన పద్ధతిలో మనం కింద కూర్చుని తినడం వలన ఇంట్లో కుటుంబ సభ్యులతో ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వచ్చు. బాండింగ్ బాగా పెరుగుతుంది. మాట్లాడుకోవడానికి సమయం దొరుకుతుంది. ఒకరితో ఒకరు ఆహార పదార్థాలను షేర్ చేసుకుంటూ తినడం వలన బంధాలు మెరుగుపడతాయి. ఇలా ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news