కాంగ్రెస్ నేతల దాడులపై డీజీపీకి కేటీఆర్ ఫిర్యాదు..!

-

రాష్ట్ర డీజీపీని కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ తదితర పార్టీ సీనియర్ నాయకులు. నిన్న తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతలు BRS కార్యకర్తల పై జరిగిన దాడి ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేశారు. అలాగే రాష్ట్రంలో బాంబుల సంస్కృతి తిరిగి తీసుకువస్తున్నారన్న నాయకులు.. పోలీసుల స్వయంగా ధర్నా శిబిరం పైన దాడి చేయడం టెంట్ పీకి వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలపై ఫిర్యాదు చేసారు.

అలాగే పోలీసులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తున్నారని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లిన BRS పార్టీ నేతలు.. రాజకీయ ప్రమేయం వలన ప్రతిపక్ష నాయకుల పైన పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు, వారు చేస్తున్న హింస గురించి ఫిర్యాదులో పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్ర మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో పోలీస్ అధికారులు పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసిన కూడాడీజీపీ దృష్టికి తీసుకెళ్లారు BRS నేతలు.

Read more RELATED
Recommended to you

Latest news